తలుపులు మూసే.. ప్రజలకు ఎదురుచూపులే! టీ బిల్లుల కోసం చిరువ్యాపారి ప్రదక్షిణలు.. సమస్యలపై వచ్చే ప్రజలకు నిరీక్షణేనా?

తలుపులు మూసే.. ప్రజలకు ఎదురుచూపులే! టీ బిల్లుల కోసం చిరువ్యాపారి ప్రదక్షిణలు.. సమస్యలపై వచ్చే ప్రజలకు నిరీక్షణేనా? పాలేరు , అక్టోబర్ 18 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల ఎంపీడీవో కార్యాలయ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ సమస్యల పరిష్కారం కోసం మండలంలోని దూరప్రాంత గ్రామాల నుంచి కార్యాలయానికి వస్తున్న ప్రజలకు సరైన స్పందన లభించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వచ్చినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడం, సమావేశాల పేరుతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సమావేశాల పేరుతో నిరీక్షణేనా? ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయానికి వచ్చినప్పుడు,...