Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న ప్రముఖ జర్నలిస్ట్ అంతోటి శ్రీనివాస్

Author
Posted By peoples voice
| 15 Oct 2026, 02:03 PM | TELANGANA, ఖమ్మం
సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న ప్రముఖ జర్నలిస్ట్ అంతోటి శ్రీనివాస్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

ఖమ్మం , అక్టోబర్ 15 ( పీపుల్స్ వాయిస్ ) :

పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ అంతోటి శ్రీనివాస్ తన సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజా జ్యోతి పత్రిక ఖమ్మం జిల్లా బ్యూరోగా, టిడబ్ల్యూజేఎఫ్ హెచ్2843 ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అంతోటి శ్రీనివాస్, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు. అదే విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

తాజాగా బీహెచ్ఆర్సీ (BHRC) హ్యూమన్ రైట్స్ చైర్మన్‌గా ఎన్నికైన అంతోటి శ్రీనివాస్, మానవ హక్కుల పరిరక్షణతో పాటు సమాజ సేవలో మరింత చురుకైన పాత్ర పోషించేందుకు ముందుకు సాగుతున్నారు. బాధితులకు అండగా నిలవడం, ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు.

జర్నలిజాన్ని కేవలం వార్తల ప్రచురణకే పరిమితం చేయకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా మలచాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా అంతోటి శ్రీనివాస్ మరింత సేవలందించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: