Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

“నన్ను టచ్ చేస్తే.. ఒక్క ఓటు కూడా పడనివ్వను” – మెండెం కిరణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు

Author
Posted By peoplesvoice
| 06 Oct 2026, 09:39 PM | TELANGANA, ఖమ్మం
“నన్ను టచ్ చేస్తే.. ఒక్క ఓటు కూడా పడనివ్వను” – మెండెం కిరణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు

“నన్ను టచ్ చేస్తే.. ఒక్క ఓటు కూడా పడనివ్వను”
ప్రతిపక్ష నేతలకు రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఘాటు హెచ్చరిక

కొత్తగూడెం అక్టోబర్ 06 (పీపుల్స్ వాయిస్): “నన్ను టచ్ చేయొద్దు.. హద్దుమీరి మాట్లాడొద్దు.. నన్ను టార్గెట్ చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క ఓటు కూడా పడనివ్వను” అంటూ రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “ఇది నా ఇగోతో చెప్పడం లేదు.. నా వెనుక ఉన్న యువ సైన్యమే నా ధైర్యం” అని ఆయన అన్నారు.

కొత్తగూడెం క్లబ్‌లో రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ మేళాలో కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు.

“నన్ను టచ్ చేయొద్దు.. హద్దుమీరి మాట్లాడొద్దు”

తనను, తన విద్యార్థులను ఉద్దేశించి రాజకీయ విమర్శలు చేసే వారు హద్దులు దాటవద్దని కిరణ్ కుమార్ సూచించారు. తాను ఇగోతో మాట్లాడటం లేదని, తన వెనుక ఉన్న యువతే తనకు బలమని పేర్కొన్నారు. తనపై రాజకీయంగా విమర్శలు చేసే వారు హద్దులు దాటితే తగిన విధంగా స్పందిస్తానని అన్నారు.

“వేలాది మంది ఉద్యోగులను తీర్చిదిద్దిన చరిత్ర నాది”

విద్యా, ఉద్యోగ శిక్షణ రంగంలో తాను ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నానని కిరణ్ కుమార్ తెలిపారు. వేలాది మంది ఉద్యోగార్థులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించామని పేర్కొన్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కష్టాలను, వారి కుటుంబాల ఆవేదనను దగ్గరగా చూశానని అన్నారు.

ఇవి కూడా చదవండి

యువత ఉద్యోగ కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ ద్వారా శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కూడా అండగా నిలుస్తున్నామని చెప్పారు.

కరోనా సమయంలోనూ ఉద్యోగార్థులకు అండ

కరోనా సమయంలో విద్యా, ఉద్యోగ శిక్షణ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ ఉద్యోగార్థులను వదిలిపెట్టలేదని కిరణ్ కుమార్ తెలిపారు. ఆర్‌సీ ఎగ్జామ్స్ యాప్ ద్వారా ఆన్‌లైన్ కోచింగ్ అందించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు సహకరించినట్లు చెప్పారు.

విధి నిర్వహణలో మరణించిన పోలీసు సిబ్బంది పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించినట్లు వివరించారు.

ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ మేళాకు భారీ స్పందన

కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ మేళాకు పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు, యువతీ యువకులు హాజరయ్యారు. గ్రాడ్యుయేట్లకు ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు.

యువత విద్య, ఉద్యోగ సాధనతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకైన భాగస్వాములు కావాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్లు, యువతతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కిరణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.