Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

44వ పుట్టినరోజు వేడుకల్లో రాంబాబుకు ఘన సన్మానం RRR ఫంక్షన్ హాల్‌లో సందడి.. సేవా కార్యక్రమాలకు పెద్దపీట

Author
Posted By peoplesvoice
| 08 Oct 2026, 12:13 PM | TELANGANA, ఖమ్మం
44వ పుట్టినరోజు వేడుకల్లో రాంబాబుకు ఘన సన్మానం  RRR ఫంక్షన్ హాల్‌లో సందడి.. సేవా కార్యక్రమాలకు పెద్దపీట

44వ పుట్టినరోజు వేడుకల్లో రాంబాబుకు ఘన సన్మానం

RRR ఫంక్షన్ హాల్‌లో సందడి.. సేవా కార్యక్రమాలకు పెద్దపీట

44వ పుట్టినరోజు వేడుకల్లో రాంబాబుకు ఘన సన్మానం  RRR ఫంక్షన్ హాల్‌లో సందడి.. సేవా కార్యక్రమాలకు పెద్దపీట - Additional Image

ఖమ్మం: శ్రీ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుంచపు రాంబాబు 44వ జన్మదిన వేడుకలు ఖమ్మంలోని త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు, సంస్థ ఉద్యోగులు, మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

డాక్టర్ కుంచపు రాంబాబును పూలమాలలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా పలువురు ఆయనతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

స్వయంకృషితో ఎదిగి..

ఇవి కూడా చదవండి

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ కుంచపు రాంబాబు స్వయంకృషితో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారని కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు. శ్రీ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ద్వారా నాణ్యత, పారదర్శకత, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు.

సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం

జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉచిత వైద్య పరీక్షల శిబిరం, మందుల పంపిణీ, అన్నదానం, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు. విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

‘ప్రజల ఆశీర్వాదం మరువలేను’

ఈ సందర్భంగా డాక్టర్ కుంచపు రాంబాబు మాట్లాడుతూ తన ఎదుగుదలలో కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, కస్టమర్లు, మిత్రులు, అభిమానుల సహకారం ఎంతో ఉందన్నారు. తనకు లభించిన స్థాయిని సమాజ సేవకు వినియోగించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. జీవితాంతం విద్య, వైద్యం, పేదల సంక్షేమానికి తన వంతు సహాయం అందిస్తానన్నారు.

డాక్టర్ కుంచపు రాంబాబు మరిన్ని విజయాలు సాధించి ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని వేడుకలకు హాజరైన ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షించారు. త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన జన్మదిన వేడుకలు అభిమానుల సందడితో ఘనంగా ముగిశాయి.