Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

కఠిన సవాళ్లను అధిగమించిన రన్నర్ పిల్లి రాజుకు ఘన సన్మానం

Author
Posted By peoplesvoice
| 08 Oct 2026, 07:30 PM | TELANGANA, ఖమ్మం
కఠిన సవాళ్లను అధిగమించిన రన్నర్ పిల్లి రాజుకు ఘన సన్మానం

కఠిన సవాళ్లను అధిగమించిన రన్నర్ పిల్లి రాజుకు ఘన సన్మానం

ఖమ్మం అక్టోబర్ 09( పీపుల్స్ వాయిస్ ): వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవం సందర్భంగా లకారం ట్యాంక్ వాకర్స్ క్లబ్, శ్రీ దుర్గ మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ రన్నర్, తెలంగాణ పోలీస్ అథ్లెట్ పిల్లి రాజును ఘనంగా సన్మానించారు. 100 కిలోమీటర్ల అల్ట్రా రన్‌తో పాటు లడఖ్‌లో 17,678 అడుగుల ఎత్తులో నిర్వహించిన 72 కిలోమీటర్ల Khardung La Challenge‌ను పూర్తి చేయడం అభినందనీయమని SUDHA చైర్మన్ దుర్గాప్రసాద్ కొనియాడారు. ప్రతికూల వాతావరణం, అత్యల్ప ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ మధ్య ఈ ఘనత సాధించడం ఖమ్మం జిల్లాకే గర్వకారణమన్నారు. “Run for Health – Say No to Drugs” సందేశంతో యువతను క్రీడలు, ఆరోగ్యం, క్రమశిక్షణ వైపు ప్రోత్సహిస్తున్న పిల్లి రాజు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ పిల్లి రాజును భారీ పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.