Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి ఇల్లందులో న్యూడెమోక్రసీ నిరసన

Author
Posted By peoples voice
| 10 Oct 2026, 07:30 PM | TELANGANA
జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి ఇల్లందులో న్యూడెమోక్రసీ నిరసన

జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి
ఇల్లందులో న్యూడెమోక్రసీ నిరసన

ఇల్లందు, అక్టోబర్ 10 ( పీపుల్స్ వాయిస్ ) : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని, ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని విమర్శించారు.

ఎస్‌ఐఆర్‌ (SIR) పేరుతో కోట్లాది ఓట్లను తొలగించే చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు ఆరోపించారు. ఎన్నికల ప్రధాన అధికారి కేంద్ర ప్రభుత్వ ప్రభావానికి లోనై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 57 మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేయడం, ఢిల్లీకి లక్షలాది మంది చేరుకునే రైళ్ల రాకపోకలను రద్దు చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యంపై దాడి అని వారు ఆరోపించారు. రైలు మార్గాలు, మెట్రో స్టేషన్ల మూసివేతతో పాటు నెట్‌వర్క్‌లను నిలిపివేయడంపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదని విమర్శించారు.

ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు ఎండీ రాసుద్దిన్, తోడేటి నాగేశ్వరరావు, నరాటి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి కొప్పుల శ్రీనివాస్, ఎల్. ధనంజయ, టి. సామెల్ తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: