Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

చింతకాని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి

Author
Posted By peoples voice
| 15 Oct 2026, 01:21 PM | TELANGANA, ఖమ్మం
చింతకాని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి

చింతకాని మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి (మనం న్యూస్), కార్యదర్శిగా గుడిది పిచ్చయ్య

చింతకాని, అక్టోబర్ 15 ( పీపుల్స్ వాయిస్ ) :

చింతకాని మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి (మనం న్యూస్), కార్యదర్శిగా గుడిది పిచ్చయ్య (సి.కె. న్యూస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఎంపికలో భాగంగా పలువురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

కమిటీ సభ్యులు:

ఇవి కూడా చదవండి

- గడ్డం విజయ్ (ప్రజా దర్బార్)
- శెట్టి సురేష్ (సందేశం టైమ్స్)
- గండారపు రామారావు (సంచలన వార్త)
- గంటల తిరుపతాచారి (మెట్రో ఉదయం)
- వేర్పుల కోటేశ్వరరావు (పయనించే సూర్యుడు)
- చాపలమడుగు మంగతాయి (ప్రజా వేదిక)

నూతన కమిటీ ఎన్నికతో చింతకాని మండలంలో జర్నలిస్టుల ఐక్యతకు మరింత బలం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు, కార్యదర్శితో పాటు కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ప్రెస్ క్లబ్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా నిలవాలని సూచించారు.

నూతన కమిటీ జర్నలిస్టుల ఐక్యతను కాపాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించి, పాత్రికేయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: