Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఆర్టీసీలో యూనియన్ విజయం _ ప్రలోభాలకు లొంగని కార్మికులు

Author
Posted By peoples voice
| 10 Oct 2026, 06:14 PM | TELANGANA, ఖమ్మం
ఆర్టీసీలో యూనియన్ విజయం _ ప్రలోభాలకు లొంగని కార్మికులు

ఆర్టీసీలో యూనియన్ విజయం
ప్రలోభాలకు లొంగని కార్మికులు

ఖమ్మం, అక్టోబర్ 10 (పీపుల్స్ వాయిస్):

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు పనిచేసే సంఘానికే పట్టం కట్టారని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. కష్టకాలంలో కార్మికులకు అండగా నిలిచి, హక్కుల కోసం పోరాడిన సంఘానికి గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్ని ప్రలోభాలు ఎదురైనా కార్మికులు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

శుక్రవారం జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఎంప్లాయీస్ యూనియన్ కూటమి అభినందన సభ శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రావి శివరామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కార్మికులు తమకు అండగా నిలిచిన సంఘానికే మద్దతు తెలిపారని పేర్కొన్నారు.

50 శాతానికి పైగా ఓట్లు సాధించి ఎంప్లాయీస్ యూనియన్ కూటమి విజయం సాధించిందని, ఈ గెలుపు యూనియన్ బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు సీపీఐ, ఏఐటీయూసీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు, రీజియన్ అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్ రెడ్డి, పిల్లి రమేష్, నాయకులు మహ్మద్ సలాం, శింగు నర్సింహారావు, తోట రామాంజనేయులు, అనిత, గాదె లక్ష్మీనారాయణ, ఎల్ఆర్‌కే రావు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: