Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేపే భూమిపూజ టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం

Author
Posted By peoples voice
| 11 Oct 2026, 08:22 PM | TELANGANA, ఖమ్మం
ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేపే భూమిపూజ  టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం

ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేపే భూమిపూజ

టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం

ఖమ్మం, అక్టోబర్ 11 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం నగర ప్రజల చిరకాల ఆకాంక్ష సాకారం దిశగా మరో ముందడుగు పడనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఆలయ నిర్మాణ కార్యక్రమం ముందుకు సాగుతోందని ఎస్సీ సెల్ ఖమ్మం జిల్లా నాయకులు నారపోగు సుదర్శన్ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం నగర ప్రజలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిస్తుందని పేర్కొన్నారు.

అక్టోబర్ 12వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఖమ్మం నగరంలోని 15వ డివిజన్ అల్లిపురం కొత్తగూడెం ప్రాంతంలో భూమిపూజ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి 8వ డివిజన్‌తో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు హాజరై భూమిపూజ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నారపోగు సుదర్శన్ కోరారు. భక్తులందరూ స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: