Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

నాగులవంచ గడీ సెంటర్‌లో అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు _ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆరాధన.. ఘనంగా గోపూజ, పంచహారతి, బతుకమ్మ సంబరాలు

Author
Posted By peoples voice
| 12 Oct 2026, 01:54 PM | TELANGANA, ఖమ్మం
నాగులవంచ గడీ సెంటర్‌లో అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు _  శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆరాధన.. ఘనంగా గోపూజ, పంచహారతి, బతుకమ్మ సంబరాలు

నాగులవంచ గడీ సెంటర్‌లో అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు

శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆరాధన.. ఘనంగా గోపూజ, పంచహారతి, బతుకమ్మ సంబరాలు

చింతకాని, అక్టోబర్ 12 ( పీపుల్స్ వాయిస్ ) : నాగులవంచ గ్రామంలోని గడీ సెంటర్‌లో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి, కనకదుర్గమ్మ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో గడీ సెంటర్‌ మార్మోగగా, ప్రత్యేక పూజలు, హారతులతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అయ్యగారు దాములూరి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో గోపూజ, పంచహారతి, బతుకమ్మ సంబరాలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం శ్రీనివాసరావు–చిట్టెమ్మ, అంబటి రాజేంద్రప్రసాద్–శ్రీలక్ష్మి, ఆళ్ల మాధవరావు–అరుణ దంపతులు పీటలపై ఆశీనులై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిపారవశ్యంతో సాగిన పూజా కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

భక్తులతో కిటకిటలాడిన గడీ సెంటర్‌

అమ్మవారి పూజలు, హారతులు, బతుకమ్మ సంబరాలతో గడీ సెంటర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. కనకదుర్గమ్మ మాలధారులు, మహిళలు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, సామినేని అప్పారావు, ఆలస్యం బసవయ్య, అంబటి శాంతయ్య, ఆలస్యం రవి, ఏటుకూరి రవి, తోటకూరి చిన్న, బోడేపూడి కిరణ్, కోలేటి పెద్ద బ్రహ్మం, కోలేటి పుల్లయ్య, కిలారు నరసింహారావు, ఆలస్యం శ్రీను, అంబటి వెంకటేశ్వర్లు, ఆలస్యం సుధాకర్, తాత శ్రీను, తోటకూరి వెంకట నరసయ్య, ఆలస్యం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

కమిటీ సభ్యులు కన్నేటి శ్రీరామ్, నెల్లూరి సురేష్, కాసరగడ్డ సాత్విక్, కిలారు తరుణ్ కుమార్, ఆలస్యం రాజేష్, తన్నీరు ప్రవీణ్, హరికృష్ణారెడ్డి, యడ్లపల్లి గౌతమ్, తోటకూరి చైతన్య, పొన్నం అభిలాష్, బండి అనిల్, ఆలస్యం రామారావు, అంబటి లాచయ్య, చావా జస్వంత్, తోట గౌతమ్, బోడేపూడి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: