23/10/2026, Friday · 08:07:43 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తి మృతి

Yakub Pasha 23/10/2026 7:05 PM క్రైమ్

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తి మృతి
Want this news as a newspaper clip?Print News Clip

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తి మృతి

భార్య ఫిర్యాదుతో తొమ్మిది మందిపై కేసు నమోదు

చింతకాని, అక్టోబర్ 23 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో వ్యవసాయ భూమి వివాదం నేపథ్యంలో కన్నెబోయిన కొండలు మృతి చెందిన ఘటనపై పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కన్నెబోయిన నాగేంద్రమ్మ తన భర్త కొండలు, కుమారుడు ఉపేందర్‌పై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించి, చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన కొండలు గడ్డిమందు సేవించినట్లు ఆమె పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 22న ఆయన మృతి చెందారు.

నాగేంద్రమ్మ ఫిర్యాదు మేరకు కన్నెబోయిన అంజయ్య, నాగేంద్ర, నాగేశ్వరరావు, రామారావు, సాయి, శ్రీను, శీలం చైతన్య, కన్నెబోయిన సీతారామయ్య, చౌడం సత్యంపై కేసు నమోదు చేసినట్లు చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ తెలిపారు. ఘటనపై తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి :: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి: అఖిలపక్ష నాయకుల డిమాండ్

contextDeathpersonland

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

68 Posts

Latest News