19/11/2026, Thursday · 07:36:58 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్ _ ఎస్‌ఐ జి. నరేష్

Yakub Pasha 18/11/2026 7:38 PM క్రైమ్

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్ _ ఎస్‌ఐ జి. నరేష్
Want this news as a newspaper clip?Print News Clip

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్

1.065 కేజీల ఎండు గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం

గంజాయి విలువ రూ.53,250

చింతకాని , నవంబర్ 18 (పీపుల్స్ వాయిస్): చింతకాని పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1 కేజీ 65 గ్రాముల ఎండు గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.చింతకాని మండలంలో గంజాయి అక్రమ విక్రయాలు, వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నవంబర్ 17వ తేదీ రాత్రి మండలంలోని తుమ్మలమ్మ చెరువు కట్ట వద్ద ఎస్‌ఐ జి. నరేష్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు.వారి నుంచి సుమారు రూ.53,250 విలువైన 1 కేజీ 65 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలకు ఉపయోగించినట్లు భావిస్తున్న నాలుగు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో కొమ్ము ప్రణయ్, పెశెట్టి శ్రీశాంత్, మహ్మద్ అబ్దుల్ ఆదిల్, షేక్ అక్మల్, పెనుగొండ సాయిలను అరెస్ట్ చేశారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న టీన్ను అలియాస్ వినయ్, షఫీ, జావేద్, ఖాజా, శ్రీకాంత్, ప్రకాష్ నగర్ సాయి అనే వ్యక్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు_ఎస్సై గజ్జల నరేష్

people arrestedFivesellingmarijuanaNaresh

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

223 Posts

Latest News

నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం నవంబర్ 30న ఐక్య క్రిస్మస్ ఆరాధన _ క్రైస్తవ నాయకులకు పిలుపు రవీంద్ర భారతిలో ఘనంగా టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం _ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో ప్రజాగర్జనను జయప్రదం చేయండి - ఎస్.కె లాల్మియా పిలుపు చిన్న వయసులోనే హైకోర్టు న్యాయవాదిగా ప్రత్యేక గుర్తింపు వందనం గ్రామంలో ఇందిరమ్మ ‘చేయూత’ పింఛన్ పత్రాల పంపిణీ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు_ఎస్సై గజ్జల నరేష్ కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - PDSU జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్ జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల ఇళ్ల స్థలాల జీఓ 147ను అమలు చేయాలి _ సివై పుల్లయ్య వెలుగుమట్ల భూదాన భూమికి ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుంటాం! మాస్ లైన్