22/11/2026, Sunday · 02:16:07 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలి!

Yakub Pasha 21/11/2026 5:15 PM ఖమ్మం

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలి!
Want this news as a newspaper clip?Print News Clip

 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలి!

 పోస్టుల భర్తీకి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలి!

 ఉద్యోగులపై వేధింపులు, అనవసర మెమోల జారీని నిలిపివేయాలి

 సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి: IFTU జిల్లా అధ్యక్షులు షేక్ సుభహాన్

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అంగన్‌వాడీ ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులను అరికట్టి, అనవసర మెమోల జారీని నిలిపివేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) జిల్లా అధ్యక్షులు షేక్ సుభహాన్ డిమాండ్ చేశారు.ఈ మేరకు IFTU నాయకుల బృందం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి (DWO) ప్రమీలను కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసింది.ఈ సందర్భంగా షేక్ సుభహాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి కనీస గౌరవం, న్యాయమైన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం అన్యాయమన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తలకు గౌరవప్రదమైన హోదా కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వారికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

సూపర్వైజర్ల వేధింపులకు అడ్డుకట్ట వేయాలి

జిల్లాలో కొంతమంది సూపర్వైజర్లు స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అంగన్‌వాడీ టీచర్లను అనవసరంగా వేధిస్తున్నారని షేక్ సుభహాన్ ఆరోపించారు. చిన్నచిన్న విషయాలకే వివరణలు కోరుతూ మెమోలు జారీ చేయడం, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. మెమోల పేరుతో మానసిక ఒత్తిడికి గురిచేసే చర్యలను తక్షణమే నిలిపివేయాలని DWO ప్రమీలతో స్పష్టంగా చర్చించినట్లు తెలిపారు.

నిబంధనల ప్రకారం న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారులు తమ అధికారాలను ఉద్యోగులను వేధించేందుకు ఉపయోగించకూడదని హితవు పలికారు.

పదోన్నతుల్లో అర్హులకు న్యాయం చేయాలి

అర్హత కలిగిన అంగన్‌వాడీ టీచర్లకు సూపర్వైజర్ పదోన్నతులు కల్పించాలని, హెల్పర్ నుంచి టీచర్ వరకు, టీచర్ నుంచి సూపర్వైజర్ వరకు పదోన్నతుల్లో ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హెల్పర్, టీచర్, సూపర్వైజర్, CDPO స్థాయిల్లో సమన్యాయం, పరస్పర గౌరవం, సమన్వయం ఉన్నప్పుడే అంగన్‌వాడీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా G.O.Ms.No.14, G.O.Rt.No.23 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతులను ప్రతి ప్రాజెక్టు కార్యాలయానికి పంపించి, వాటిపై అంగన్‌వాడీ కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేసినా, వారిని వేధింపులకు గురిచేసినా IFTU చూస్తూ ఊరుకోదని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తుందని షేక్ సుభహాన్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో IFTU నాయకులు పద్మ, శిరోమణి, లక్ష్మీమణి, విజయ, ముత్తిలింగం, పుష్ప, సుజాత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే! మామిడి సోమయ్య

immediate notificationissuedfillAnganwadiposts

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

245 Posts

Latest News

ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి! గోగినపల్లి మస్తాన్ జనసేనలోకి ఖమ్మం నేత మాటేటి రవి! మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి! కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి! డీపీఆర్ఓకు టీజేఎఫ్ వినతి మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం! కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!సి.వై. పుల్లయ్య 44వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై విస్తృత ప్రచారం! కోర్టు ఉత్తర్వులకే బేఖాతరా..? 85 ఏళ్ల వృద్ధురాలి ఆచూకీ ఏదీ.. వారసత్వ భూములపై మ్యుటేషన్ యత్నాలా! వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి_ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్