04/11/2026, Wednesday · 07:28:10 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్

Yakub Pasha 04/11/2026 5:24 PM ఖమ్మం

అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్
Want this news as a newspaper clip?Print News Clip

అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్

ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

అకాల వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పాత అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్‌ఫిట్ గురుకుల పాఠశాలలను సంబంధిత అధికారులు తక్షణమే సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిమ్మిడి రఘుబాబు, తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.ఖమ్మం నగరంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అధిక వర్షాల కారణంగా పాత అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్‌ఫిట్‌గా ఉన్న భవనాల్లో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు.వర్షాలు తగ్గేంత వరకు విద్యార్థులకు మెరుగైన వసతి, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. అకాల వర్షాల వల్ల అనారోగ్యానికి గురయ్యే విద్యార్థులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు తక్షణమే సందర్శించి పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గురుకుల విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, అద్దె భవనాల స్థానంలో అన్ని వసతులతో కూడిన సొంత గురుకుల భవనాలను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పీడీఎస్‌యూ నాయకులు సుశాంత్, కార్తీక్, మురళీకృష్ణ, బాలు, ప్రవీణ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Lakshman DemandOfficersVisitUnfitGurukulTipparapu

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

153 Posts

Latest News

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు! మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత! అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు! మురసు తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్ జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని