జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే టీజేఎఫ్ లక్ష్యం! _ ఆకుతోట ఆదినారాయణ

- జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే టీజేఎఫ్ ప్రధాన లక్ష్యం
- సమిష్టి కృషి, ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం_ ఆకుతోట ఆదినారాయణ
- ఖమ్మం జిల్లాలో 1,200 అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు కృషి
- అల్లం నారాయణ ఉద్యమ స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే టీజేఎఫ్ లక్ష్యం!
సమిష్టి కృషితోనే సమస్యలకు పరిష్కారం – ఆకుతోట ఆదినారాయణ
అధికారులతో దశలవారీ చర్చల ఫలితంగా జిల్లాలో 1,200 అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు కృషి
ఖమ్మం ప్రతినిధి, నవంబర్ 2 (పీపుల్స్ వాయిస్):
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీజేఎఫ్) నిరంతరం పనిచేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ పేర్కొన్నారు. సమిష్టి కృషి, ఐక్యతతోనే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.ఆదివారం సంస్థ కార్యాలయంలో నినాదం పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులకు కార్డులను అందజేశారు.అనంతరం ఆదినారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నాయకత్వం ఎల్లప్పుడూ ముందుండి పోరాడాలని సూచించారు. జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీజేఎఫ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీజేఎఫ్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అల్లం నారాయణ నాయకత్వంలో కొద్దిమందితో ప్రారంభమైన ఈ సంఘం నేడు రాష్ట్రవ్యాప్తంగా బలమైన జర్నలిస్టు సంఘంగా ఎదిగిందని పేర్కొన్నారు.ఖమ్మం జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో టీజేఎఫ్‌కు ఒక్కరి ప్రాతినిధ్యం మాత్రమే ఉన్నప్పటికీ, చిన్నా పెద్దా పత్రికలనే తారతమ్యం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలనే లక్ష్యంతో పోరాటం చేశామని వివరించారు. అధికారులతో దశలవారీగా చర్చలు జరుపుతూ, సమన్వయంతో వ్యవహరించడం ద్వారా జిల్లాలో 1,200 అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు కృషి చేశామని తెలిపారు.ఈ సందర్భంగా టీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్తంభమైన జర్నలిస్టుల ప్రజల పక్షాన నిలిచినప్పుడే పాత్రికేయ వృత్తికి నిజమైన గౌరవం లభిస్తుందని అన్నారు. పరిశోధనాత్మక వార్తల ద్వారా ప్రజా సమస్యలను, అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలో ఆకుతోట ఆదినారాయణ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆయన నాయకత్వంలో టీజేఎఫ్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం నినాదం పత్రిక జిల్లా, మండల స్థాయి రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, నినాదం బ్యూరో ఇన్‌చార్జి బిక్కి గోపి, స్టాఫర్ నరసింహారావు, సంగమేశ్వర ప్రసాద్, సత్తుపల్లి ఆర్‌సీ ఇన్‌చార్జి ధూపాటి నరేష్ రాజు, వెంకయ్య, పాషా, శంకర్, మహేష్, శ్రీనివాస్ రోషయ్య, మాదవి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: అమరవీరుల రక్తతర్పణం వృథా కానివ్వం.. సమ సమాజ స్థాపన కోసం పోరాడుతాం!_ మాస్ లైన్ కార్యదర్శి పుల్లయ్య












