28/10/2026, Wednesday · 12:40:29 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మృతి.. బైపాస్‌పై 3 గంటలకు పైగా రాస్తారోకో

Yakub Pasha 28/10/2026 8:05 AM ఖమ్మం

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మృతి.. బైపాస్‌పై 3 గంటలకు పైగా రాస్తారోకో
Want this news as a newspaper clip?Print News Clip
  • అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మృతి.. బైపాస్‌పై 3 గంటలకు పైగా రాస్తారోకో
  • టీచర్‌, ఆయా సస్పెన్షన్‌కు హామీ.. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, ఉద్యోగం

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మృతి.. బైపాస్‌పై 3 గంటలకు పైగా రాస్తారోకో

టీచర్‌, ఆయా సస్పెన్షన్‌కు హామీ.. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, ఉద్యోగం

ఖమ్మం, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్):
 ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రాంతంలో అంగన్‌వాడీ కేంద్రంలో విషపురుగు కాటుతో చిన్నారి మృతి చెందిన ఘటనపై ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్రంలో మౌలిక సదుపాయాలు, రక్షణ చర్యలు లేకపోవడమే ఘటనకు కారణమని ఆరోపిస్తూ సీపీఐ, సీపీఎం, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, బీఆర్‌ఎస్‌, పీడీఎస్‌యూ తదితర సంఘాల ఆధ్వర్యంలో టేకులపల్లి బ్రిడ్జి సమీపంలోని బైపాస్‌ రోడ్డుపై మూడు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయాను సస్పెండ్‌ చేయాలని, బాధిత పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పర్యవేక్షణను పెంచాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

ఆందోళన నేపథ్యంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ధర్నా స్థలానికి చేరుకుని నాయకులతో చర్చలు జరిపారు. అంగన్‌వాడీ టీచర్‌, ఆయాను సస్పెండ్‌ చేస్తామని, ఇల్లు లేని బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కేటాయిస్తామని, కుటుంబంలో ఒకరికి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఇది కూడా చదవండి :: ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తం.. నీటి పొదుపు, ఆరుతడి పంటల సాగుపై వందనం గ్రామసభ

Child diesAnganwadicentrewritingbypasshours

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

108 Posts

Latest News

తుఫాను హెచ్చరిక.. అత్యవసరమైతేనే బయటకు రండి _చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి - సి.వై. పుల్లయ్య డిమాండ్‌ ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఏఐకేఎంఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని కలిసిన అంబేద్కర్ నాగరాజు వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించాలి_గుమ్మడి నరసయ్య పీడీఎస్‌యూలోకి పలువురి చేరికలు విధి నిర్వహణలో మరణించిన ఎస్సై కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం ట్రాక్టర్ ప్రమాద బాధితులకు ఎమ్మార్పీఎస్ పరామర్శ బిర్యానీలో బొద్దింక.. మధిర మేఘన రెస్టారెంట్‌లో కలకలం! ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ రెడ్డి విజయమే లక్ష్యం _ నూతి సత్యనారాయణ గౌడ్