21/10/2026, Wednesday · 11:17:00 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

మూగజీవాల ప్రేమికుడు కనకం మైసయ్య కన్నుమూత

Yakub Pasha 21/10/2026 9:30 PM ఖమ్మం

మూగజీవాల ప్రేమికుడు కనకం మైసయ్య కన్నుమూత
Want this news as a newspaper clip?Print News Clip
  • మూగజీవాల ప్రేమికుడు కనకం మైసయ్య కన్నుమూత
  • మతాలకు అతీతంగా చిన్ననాటి స్నేహితుల ఆత్మీయ వీడ్కోలు
  • శునకాల ఆకలి తీర్చడమే సేవగా భావించిన మైసన్న..
  • మైసయ్య మృతికి పలు రాజకీయ పార్టీల నాయకుల నివాళులు

మూగజీవాల ప్రేమికుడు కనకం మైసయ్య కన్నుమూత

మతాలకు అతీతంగా చిన్ననాటి స్నేహితుల ఆత్మీయ వీడ్కోలు

శునకాల ఆకలి తీర్చడమే సేవగా భావించిన మైసన్న..

మైసయ్య మృతికి పలు రాజకీయ పార్టీల నాయకుల నివాళులు

 కూసుమంచి, అక్టోబర్ 21 ( పీపుల్స్ వాయిస్ ): 

మూగజీవాల ఆకలి తీర్చడంలోనే ఆనందాన్ని వెతుక్కున్న జంతు ప్రేమికుడు కనకం మైసయ్య (54) ఇకలేరు. బాల్యం నుంచే శునకాలపై అపారమైన ప్రేమను పెంచుకుని, ఇంట్లో పెంచుకునే శునకాలతో పాటు వీధుల్లో తిరిగే శునకాలకు సైతం తన సొంత ఖర్చులతో ఆహారం అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన కూసుమంచి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కనకం మైసయ్య అలియాస్ మైసన్న మంగళవారం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటుండగా రక్తపోటు సమస్యతో అస్వస్థతకు గురై మృతి చెందారు. ఆయన అంతిమయాత్రలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన చిన్ననాటి స్నేహితులు కలిసి పాడె మోస్తూ కన్నీటి వీడ్కోలు పలకడం పలువురిని కదిలించింది.

మూగజీవాల సేవే ఆయనకు ఇష్టం

బాల్యం నుంచే జంతువులపై ప్రత్యేక అభిమానం పెంచుకున్న మైసయ్య శునకాల సంరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇంట్లో శునకాలను పెంచుకుంటూ వాటికి అవసరమైన ఆహారాన్ని స్వయంగా సమకూర్చేవారు. బయట నుంచి ఆహారం తీసుకురావడమే కాకుండా, ఇంట్లోనే వండి ప్రేమగా తినిపించేవారు. వీధుల్లో తిరిగే శునకాలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో వాటికి ఆహారం అందించేవారు. మూగజీవాల ఆకలి తీర్చడాన్ని బాధ్యతగా భావించిన ఆయన సేవాభావం స్థానికంగా పలువురి అభిమానాన్ని చూరగొంది.

మతాలకు అతీతంగా స్నేహబంధం

మైసయ్య మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు చిన్ననాటి స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచింది. ఆయన అంతిమయాత్రలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన స్నేహితులు కలిసి పాడె మోస్తూ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. మతాలకు అతీతంగా తమ మధ్య ఉన్న స్నేహబంధాన్ని చాటుతూ ఆత్మీయ మిత్రుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ హృదయవిదారక దృశ్యం అక్కడికి వచ్చిన వారిని భావోద్వేగానికి గురిచేసింది.

పలు రాజకీయ పార్టీల నాయకుల నివాళులు

మైసయ్య మృతి పట్ల మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ రావు చరవాణి ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్, కూసుమంచి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ హఫీజ్ ఉద్దీన్, స్థానిక సర్పంచ్ కొండా కృష్ణవేణి, బీజేపీ జిల్లా నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి, వార్డు సభ్యులు చెరుకుపల్లి వీరయ్య, భారీ వీరభద్రం, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, యువజన నాయకుడు కొండా మహిపాల్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పాత్రికేయులు మైసయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మూగజీవాల పట్ల అపారమైన ప్రేమను కనబరుస్తూ, వాటి సంరక్షణలో తనదైన ముద్ర వేసుకున్న మైసయ్య మృతి కూసుమంచి ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

passes awayDumbloverKanakamMysaiah

About the author

Yakub Pasha

Yakub Pasha

Managing Director

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

55 Posts

Latest News