లకలూరిపేటలో వైసీపీకి భారీ షాక్... టీడీపీలో చేరిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి

- టీడీపీలో చేరిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి కారెమూన్ షేక్
- కూటమి అభ్యర్థికే తన మద్దతు అని ప్రకటన
- తుది జాబితా విడుదలైన గంటల వ్యవధిలోనే కీలక పరిణామం
లకలూరిపేటలో వైసీపీకి భారీ షాక్... టీడీపీలో చేరిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్)
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కారెమూన్ షేక్ టీడీపీలో చేరారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో ఆమె తన భర్త యూసుఫ్ అలీతో కలిసి పార్టీలో చేరారు.
నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలై టీడీపీలో చేరినట్లు కారెమూన్ షేక్ తెలిపారు. ఇకపై కూటమి అభ్యర్థి తోట రాజరాజేశ్వరి గెలుపు కోసం ప్రచారం చేస్తానని వెల్లడించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తోట రాజారమేష్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: మహా ధర్నాను జయప్రదం చేయాలి












