03/11/2026, Tuesday · 01:17:32 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అమరుడు శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో ఉద్యమించాలి_50వ వర్ధంతి సభలో పీడీఎస్‌యూ నేతల పిలుపు

Yakub Pasha 03/11/2026 10:06 AM ఖమ్మం

అమరుడు శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో ఉద్యమించాలి_50వ వర్ధంతి సభలో పీడీఎస్‌యూ నేతల పిలుపు
Want this news as a newspaper clip?Print News Clip

అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి

50వ వర్ధంతి సందర్భంగా స్వగ్రామం రాజారంలో పీడీఎస్‌యూ ఘన నివాళులు

రాజారం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):
 అమరుడు, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు శ్రీపాద శ్రీహరి 50వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్వగ్రామమైన రాజారంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాద శ్రీహరి విగ్రహానికి పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు సమర్పించి అమరవీరుని త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు తిప్పారపు లక్ష్మణ్, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా నాయకుడు తిమ్మిడి హనుమంతరావు మాట్లాడుతూ.. 1947లో బ్రిటిష్ పాలన పోయి స్వదేశీ పాలకుల పాలన వచ్చినప్పటికీ పేద ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని విమర్శించారు. దేశ సంపదను టాటా, బిర్లాల నుంచి నేటి అంబానీల వరకు కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ పేదలకు పేదరికాన్ని మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యారంగాన్ని వ్యాపారమయం చేస్తూ స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పగించడం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్య అందరికీ సమానంగా అందించాల్సిన బాధ్యతను విస్మరించి పాలకులు విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.నాడు స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ వంటి వీరులు ప్రాణత్యాగాలు చేయగా, అదే స్ఫూర్తితో జాజిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, చీరల స్నేహలత, సాంబయ్య, వరహాలు తదితరులు విద్యార్థుల హక్కులు, సమాజ మార్పు కోసం తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు.అమరవీరుల ఆశయాల సాధన కోసం కొనసాగుతున్న పోరాటాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని, శాస్త్రీయ విద్యావిధానం సాధనకు ముందుండాలని పిలుపునిచ్చారు. అసమానతలు లేని సోషలిస్టు సమాజ స్థాపన కోసం సాగుతున్న ప్రజా ఉద్యమాల్లో విద్యార్థులు అగ్రభాగాన నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి తిమ్మిడి రఘుబాబు, జిల్లా నాయకులు సుశాంత్, కార్తీక్ రెడ్డి, స్టాలిన్, బాలు, సుమంత్, గణేష్, సిద్ధు, ప్రవీణ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్

50va vardhamtiamarudushripadashriharisphurtitoudyamimchali

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

136 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎంపీ రవిచంద్ర ప్రత్యేక దృష్టి.. పలువురితో ఫారం-18 పూర్తి చేయించిన ఎంపీ నాగులవంచలో అనగాని సూరమ్మకు వివిధ పార్టీల నాయకుల నివాళులు ఎల్లన్ననగర్‌లో అమరవీరులకు ఘన నివాళి.. వారి ఆశయ సాధనకు పోరాటాలే నిజమైన నివాళి!_ సీవై పుల్లయ్య అమరవీరుల ఆశయ సాధనకు విద్యార్థి లోకం పునరంకితం కావాలి!_PDSU ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి_AIUKS చింతకాని సమస్యలపై సీపీఐ పోరుబాట.. తహసీల్దార్‌కు 11 డిమాండ్ల వినతిపత్రం పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: సర్పంచ్ చాపలమడుగు వీరబాబు జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే టీజేఎఫ్ లక్ష్యం! _ ఆకుతోట ఆదినారాయణ అమరవీరుల రక్తతర్పణం వృథా కానివ్వం.. సమ సమాజ స్థాపన కోసం పోరాడుతాం!_ మాస్ లైన్ కార్యదర్శి పుల్లయ్య