అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్

అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థపై సమరభేరి!
కై కొండాయగూడెం వర్ధంతి సభను జయప్రదం చేయండి
కరపత్రాలను ఆవిష్కరించిన మాస్ లైన్ నాయకులు
ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):
దోపిడీ, పీడనలేని సమసమాజ స్థాపన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వర్ధంతి సభల్లో భాగంగా ఖమ్మం ఒకటో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కై కొండాయగూడెంలో నిర్వహించనున్న అమరవీరుల వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన కరపత్రాలను నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. శిరోమణి, ఖమ్మం డివిజన్ కార్యదర్శి టీ. ఝాన్సీ మాట్లాడుతూ.. దేశంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ పాలకవర్గాల విధానాల వల్ల పేద ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడాలంటే ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములై వ్యవస్థలో మార్పు కోసం కృషి చేయాలని సూచించారు.దేశంలోని సహజ వనరులను స్వదేశీ, విదేశీ బడా కంపెనీలకు కట్టబెడుతూ ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషలిస్టు సమాజ స్థాపన లక్ష్యంగా వేలాదిమంది అమరవీరులు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధన కోసం కార్యకర్తలు నిరంతరం పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కే. శ్రీనివాస్, ఒకటో పట్టణ కార్యదర్శి జాలాది లెనిన్, బొమ్మకంటి రమేష్, అయితనబోయిన వెంకన్న, హరీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: అమరవీరుల రక్తతర్పణం వృథా కానివ్వం.. సమ సమాజ స్థాపన కోసం పోరాడుతాం!_ మాస్ లైన్ కార్యదర్శి పుల్లయ్య












