21/10/2026, Wednesday · 04:07:25 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Yakub Pasha 17/10/2026 11:10 PM సినిమా

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Want this news as a newspaper clip?Print News Clip

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వాతావరణ మార్పులు, నీటి సంక్షోభంపై చైతన్యం కలిగించే లఘు చిత్రాలు రూపొందించాలి

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు యువ ఫిలిం మేకర్లను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం, ప్రకృతి పరిరక్షణ వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యువ దర్శకులు, ఫిలిం మేకర్లు లఘు చిత్రాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో సినిమాలు, లఘు చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన వివరించారు. యువతలో దాగి ఉన్న సినీ ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించడం ద్వారా హైదరాబాద్‌ను భారతీయ సినిమా రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

young filmmakersDeputyBhattiVikramarkacongratulates

About the author

Yakub Pasha

Yakub Pasha

Managing Director

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

46 Posts

Latest News

దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి ఖమ్మంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వీరంగం.. బాటిళ్లు ధ్వంసం, మేనేజర్‌పై దాడి దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాతర్లపాడు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి నాసిరకంగా యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులు! దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తెలుగు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్‌రావు చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం