21/10/2026, Wednesday · 08:13:02 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

చింతకానిలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

Yakub Pasha 21/10/2026 6:02 PM ఖమ్మం

చింతకానిలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
Want this news as a newspaper clip?Print News Clip
  • చింతకానిలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
  • ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులతో కార్యాలయాన్ని ప్రారంభించిన మండల అధ్యక్షుడు గోపి యాదవ్

చింతకానిలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులతో కార్యాలయాన్ని ప్రారంభించిన మండల అధ్యక్షుడు గోపి యాదవ్

చింతకాని, అక్టోబర్ 21 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముందుగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతన కార్యాలయం ద్వారా మండలంలో పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయంతో నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మడిపల్లి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొప్పుల గోవిందరావు, జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే అబ్దుల్, జిల్లా నాయకులు కూరపాటి కిషోర్, నన్నక శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అలాగే సర్పంచులు కిలారి మనోహర్ బాబు, లోయ ఉపేందర్, దూసరి నేతాజీ, జోనల్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

office inauguratedMandalCongressPartyChintakanilo

About the author

Yakub Pasha

Yakub Pasha

Managing Director

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

53 Posts

Latest News