26/11/2026, Thursday · 10:11:50 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా

Yakub Pasha 26/11/2026 7:26 AM ఖమ్మం

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా
Want this news as a newspaper clip?Print News Clip

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా

ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్

ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ఎల్‌బీ నగర్‌లో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు కార్యక్రమంలో ఆయన డివిజన్ మాజీ కార్పొరేటర్ లకావత్ సైదులు నాయక్, కమర్తపు మురళితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధికారి వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు నారపోగు సుదర్శన్, పాలకుర్తి నాగేశ్వరరావు, ఎస్.కె. రంజన్, ట్రాక్టర్ వెంకన్న, కమటం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Insurance coverlakheachfamily

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

274 Posts

Latest News

రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు ఆటపాటలతో.. ఆత్మీయ సత్కారాలతో సందడిగా వన సమారాధన రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన.. బ్రెయినీ స్టార్స్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అయ్యప్ప స్వాములకు అన్నదాన సేవలో మందడపు లక్ష్మీ మనోహర్! అసమాన విద్యా అవకాశాలున్న సమాజంలో ప్రజాస్వామ్య వికాసం అసాధ్యం! చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం నూతన వధూవరులను ఆశీర్వదించిన కన్నెబోయిన గోపి యాదవ్ సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు