03/11/2026, Tuesday · 08:59:14 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Yakub Pasha 03/11/2026 6:58 PM రాష్ట్ర వార్తలు

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని
Want this news as a newspaper clip?Print News Clip
  • తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి!
  • కేంద్రం తక్షణమే రూ.25 వేల కోట్ల కరువు నివారణ నిధులు విడుదల చేయాలి
  • రైతు రుణాల రీషెడ్యూల్, పంట నష్టపరిహారం అందించాలి
  • నిత్యావసరాల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి.. కూనంనేని డిమాండ్
  • కొణిజర్ల మండలంలో కరువు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీపీఐ బృందం

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి!.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం కావొద్దు!

రూ.25 వేల కోట్ల కరువు నిధులు విడుదల చేయాలి: కూనంనేని

ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కరువు నివారణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.మంగళవారం ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండల పరిధిలో తనికెళ్ల, కొణిజర్ల తదితర కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని సీపీఐ బృందం పర్యటించింది. సాగుకు నోచుకోని బీడు భూములు, నీరు లేని చెరువులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పలు ప్రాంతాల్లో అడుగంటిన భూగర్భ జలాల పరిస్థితిని తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వర్షాభావ పరిస్థితులు, పంటల సాగు, దిగుబడులపై వివరాలు సేకరించారు.అనంతరం తనికెళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ.. కరువు నివారణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.25 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా నిధులు కేటాయించి కరువు పనులు చేపట్టాలన్నారు. కరువు పరిస్థితులపై పరస్పర రాజకీయ ఆరోపణలు చేసుకోవడం మానుకొని సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రకృతి విపత్తు వల్ల ఏర్పడిన పరిస్థితులను అధిగమించేందుకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైందని, చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవడంతో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో 69.19 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ ఏడాది కేవలం 57.04 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం 12.15 లక్షల ఎకరాలు తగ్గిందని, సాగు చేసిన పంటల్లోనూ పలుచోట్ల దిగుబడులు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సాగు చేయలేకపోయిన రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కరువు పీడిత గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని, పంట నష్టపరిహారం అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు, ఇప్పటికే ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ అందని రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరారు.రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని, ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక కరువు నిధులు కేటాయించాలని, వీబీ-జీ రామ్‌జీ పథకం ద్వారా ఉపాధి పనులు విస్తృతంగా చేపట్టి పని దినాల సంఖ్య పెంచాలని సూచించారు. కూలీలకు గిట్టుబాటు అయ్యే వేతనాలు అందించాలని, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా ఉపాధి పనులు చేపట్టాలని, ముఖ్యంగా కౌలు రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.మరోవైపు నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించి ప్రజలపై భారాలు మోపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 14 రకాల నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు సరఫరా చేయాలని సూచించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యర్రా బాబు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు దొండపాటి రమేష్, రైతు సంఘం నాయకులు రవీంద్రబాబు, మిడికంటి వెంకటరెడ్డి, తోట రామాంజనేయులు, మండల కార్యదర్శి గడల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్

state KoonamneniTelanganadeclareddrought

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అమరుడు శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో ఉద్యమించాలి_50వ వర్ధంతి సభలో పీడీఎస్‌యూ నేతల పిలుపు