26/11/2026, Thursday · 10:11:49 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఆటపాటలతో.. ఆత్మీయ సత్కారాలతో సందడిగా వన సమారాధన

Yakub Pasha 26/11/2026 8:27 PM ఖమ్మం

ఆటపాటలతో.. ఆత్మీయ సత్కారాలతో సందడిగా వన సమారాధన
Want this news as a newspaper clip?Print News Clip
  • ఘనంగా జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వయోవృద్ధుల వేడుకలు

ఆటపాటలతో.. ఆత్మీయ సత్కారాలతో సందడిగా వన సమారాధన

ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా వన సమారాధన కార్యక్రమాన్ని బుధవారం ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జి సమీపంలోని మామిడి తోటలో ఘనంగా నిర్వహించారు. జిల్లా సంఘం అధ్యక్షులు డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆత్మీయ సత్కారాలతో సందడిగా సాగాయి.ఈ సందర్భంగా మహిళలకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆకుల గణపతిరాజు తన పాటలతో సభికులను అలరించగా, మిమిక్రీ కళాకారులు వివిధ సన్నివేశాలు, పాటలతో వినోదాన్ని పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ సేవా దృక్పథాన్ని పలువురు కొనియాడారు.అనంతరం సంఘం కార్యవర్గ సభ్యులతో పాటు 70 నుంచి 80 ఏళ్లు పైబడిన వయోవృద్ధ సభ్యులను, వారి దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతల్లో సాధినేని జనార్ధన్ రావు దంపతులు, వై. కుటుంబరావు దంపతులు, వేగినాటి లక్ష్మయ్య, ఆకుల లక్ష్మీనారాయణ, మేకల భిక్షమయ్య, వల్లాల నమశ్శివాయ, ఆకుల గజపతిరాజు, షేక్ హుస్సేన్, రాములు, విశ్వనాథం, కృష్ణమాచార్యులు, దుగ్గినేని శ్రీనివాసరావు, పొదిల రామనారాయణ, సముద్రాల సత్యనారాయణ, హుండీల రాజారావు, సాధినేని రాఘవయ్య, కృష్ణమూర్తి, జగన్మోహన్ రావు, రంగస్వామి, మురళి, రవీందర్ రావు, నారాయణరెడ్డి, ఇబ్రహీం, ఉపేందర్, సాంబశివరావు, రాయల వెంకటేశ్వర్లు, జి. నాగభూషణం, కటకం పిచ్చయ్య తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్, డాక్టర్ వెలిగేటి విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి జనార్ధన్ రావు, కోశాధికారులు కె. సత్యనారాయణ రెడ్డి, ఏ. గోవర్ధన్ రావు, కె. దాసు, నరసయ్య, కోమటి లింగమూర్తి, జిల్లా కార్యదర్శి జెల్లా వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మూలగుండ్ల శ్రీహరి, సభ్యులు డాక్టర్ బి. సుశీల, జె. ఉపేందర్ రెడ్డి, ఆంజనేయులు, సుధాకర్, షేక్ యాకూబ్ బేగ్, లక్ష్మయ్య, మేకల భిక్షమయ్య, తాత రాఘవయ్య, రాయల వెంకటేశ్వర్లు, రామారావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ సంఘం సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భారీ సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

ఇది కూడా చదవండి :: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Forest worshipgamesspiritualfestivities

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

274 Posts

Latest News

రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన.. బ్రెయినీ స్టార్స్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అయ్యప్ప స్వాములకు అన్నదాన సేవలో మందడపు లక్ష్మీ మనోహర్! అసమాన విద్యా అవకాశాలున్న సమాజంలో ప్రజాస్వామ్య వికాసం అసాధ్యం! చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం నూతన వధూవరులను ఆశీర్వదించిన కన్నెబోయిన గోపి యాదవ్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు