దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

- దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
- డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
చింతకాని, అక్టోబర్ 20 (పీపుల్స్ వాయిస్): దేవి నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని చింతకాని సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. నరేష్ సూచించారు. నిమజ్జనాల సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిమజ్జన కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ప్రజలు, ఉత్సవ కమిటీలు సహకరించాలని ఎస్‌ఐ నరేష్ కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, అల్లర్లకు పాల్పడినా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క












