21/10/2026, Wednesday · 04:06:35 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

నాసిరకంగా యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులు!

Yakub Pasha 20/10/2026 5:25 PM రాష్ట్ర వార్తలు

నాసిరకంగా యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులు!
Want this news as a newspaper clip?Print News Clip

నాసిరకంగా యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులు!

పునాదుల భర్తీపైనే విమర్శలు.. నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ ఏది?

రూ.200 కోట్ల ప్రాజెక్టులో నిర్మాణ సామగ్రి నాణ్యతపై అనుమానాలు

పోతంగల్, అక్టోబర్ 20 ( పీపుల్స్ వాయిస్ ) :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనుల నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోతంగల్ మండలం రాంగంగానగర్ గ్రామం వద్ద సుమారు రూ.200 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణ పనుల్లో పునాదుల భర్తీకి వినియోగిస్తున్న ఇసుక, మొరం నాణ్యతపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ వ్యయంతో నిర్మిస్తున్న విద్యాసంస్థ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా అమలవుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అనుమతులు ఒకచోట.. ఇసుక తరలింపు మరోచోట?

నిర్మాణ పనుల కోసం మొరం సేకరించేందుకు కోటగిరి మండలం ఎత్తోండ ప్రాంతంలో అనుమతులు మంజూరైనట్లు సమాచారం. అయితే, సాలూరా మండలం హున్సా శివారులోని మంజీరా నది నుంచి ఇసుకను తరలించి నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు పొందిన ప్రాంతం నుంచే నిర్మాణ సామగ్రిని సేకరిస్తున్నారా? నిబంధనలకు అనుగుణంగానే రవాణా జరుగుతోందా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

పునాదుల భర్తీలో నాణ్యతా ప్రమాణాలేవీ?

పునాదుల భర్తీకి వినియోగిస్తున్న మట్టితో కూడిన ఇసుకపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుక నాణ్యతను పరిశీలించకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తే భవిష్యత్తులో భవన పటిష్టతపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టితో కూడిన ఇసుకపై కొద్దిపాటి మొరం వేసి, అనంతరం సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సామగ్రి నమూనాలను సేకరించి నాణ్యతా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

ఇంజనీర్ల పర్యవేక్షణపై ప్రశ్నలు

ప్రతిష్టాత్మక పాఠశాల నిర్మాణంలో వినియోగించే ఇసుక, మొరం, కంకర నాణ్యతను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. కానీ పనుల తీరుపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణ పనుల నాణ్యతతో పాటు, ఇసుక సేకరణకు సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలను కూడా అధికారులు తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించి నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నాసిరకంగా యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులు!

Construction WorksHoorayYoungIndiaSchool

About the author

Yakub Pasha

Yakub Pasha

Managing Director

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

46 Posts

Latest News

దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి ఖమ్మంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వీరంగం.. బాటిళ్లు ధ్వంసం, మేనేజర్‌పై దాడి దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాతర్లపాడు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తెలుగు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్‌రావు యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం