15/11/2026, Sunday · 05:28:45 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు కలెక్టరేట్ ఎదుట ధర్నా _ టీజేఎఫ్ పిలుపు

Yakub Pasha 14/11/2026 8:10 PM ఖమ్మం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు కలెక్టరేట్ ఎదుట ధర్నా _ టీజేఎఫ్ పిలుపు
Want this news as a newspaper clip?Print News Clip
  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు కలెక్టరేట్ ఎదుట ధర్నా
  • ఈనెల 16న ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఆందోళన
  • జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలి
  • టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి పిలుపు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు కలెక్టరేట్ ఎదుట ధర్నా _ టీజేఎఫ్ పిలుపు

ఖమ్మం, నవంబర్ 14 (పీపుల్స్ వాయిస్):
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–టీజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి డిమాండ్ చేశారు.

ఖమ్మంలో శనివారం ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించిన టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. జర్నలిస్టులు అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ వారి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనైనా జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరుతుందని ఆశిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుని తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం ఈనెల 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, మందుల ఉపేందర్, ప్రశాంత్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, ఖమ్మం నగర ప్రధాన కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష, కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి బిక్కీ గోపి, ఉపాధ్యక్షులు మూల జీవన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు ఉత్కంఠం శ్రీను, కళ్యాణ్, మోహన్, సాయి, తిరుపతిరావు, యాదగిరి, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, ఎన్టీవీ సాయి, నాగశేఖర్, పెంటి వెంకటేశ్వర్లు, నరసింహారావు, కూరపాటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు

TJF callSitprotestfrontCollectorateallotmentplotsjournalists

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

207 Posts

Latest News

నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల వితరణ తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సీ.వై. పుల్లయ్య కామన్ స్కూల్ విధానమే సామాజిక సమానత్వానికి పునాది! తీన్మార్ మల్లన్న పాదయాత్రపై లారీ దూసుకొచ్చిన ఘటనను ఖండించిన టీఆర్పీ ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సి.వై. పుల్లయ్య పిలుపు బొమ్మెర రామ్మూర్తికి ఘన సత్కారం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచులు ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పిలుపు పేదల ఇళ్లను కూల్చి.. ఇప్పుడు భూమికి ప్రహరీనా - సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్