అయ్యప్ప అన్నదాన సేవకు కర్నాటి కృష్ణయ్య నగర్ వాసుల చేయూత _ నిత్య అన్నదానానికి రూ.10 వేల విరాళం అందజేత

అయ్యప్ప అన్నదాన సేవకు కర్నాటి కృష్ణయ్య నగర్ వాసుల చేయూత
నిత్య అన్నదానానికి రూ.10 వేల విరాళం అందజేత
నేలకొండపల్లి, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
అయ్యప్ప మాలధారణ భక్తులకు గురుస్వామి బీ. ఉపేందర్ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి కర్నాటి కృష్ణయ్య నగర్ కాలనీ వాసులు రూ.10 వేల విరాళం అందజేశారు. కాలనీ ప్రతినిధి మారిశెట్టి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఈ విరాళాన్ని ఉపేందర్‌కు అందించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ అన్నదాన సేవలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం మరింత ఉత్సాహంగా కొనసాగుతుందని గురుస్వామి ఉపేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, అయ్యప్ప గురుస్వాములు, మాలధారణ భక్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్












