రవీంద్ర భారతిలో ఘనంగా టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం _

- సమావేశంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా అధ్యక్షులు జి. నాగస్వామి, జిల్లా నాయకులు
రవీంద్ర భారతిలో ఘనంగా టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్, నవంబర్ 18 (పీపుల్స్ వాయిస్):
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు కేవీ రమణారావు, సంఘం వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంఘం బలోపేతం, జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశానికి ఖమ్మం జిల్లా నుంచి టీజేఏ జిల్లా అధ్యక్షులు జి. నాగస్వామి పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా నాయకులు నల్లమోతు శ్రీనివాస్, ఎం. రవీందర్, ప్రశాంత్, సౌమ్య, ఉపేందర్ తదితరులు హాజరయ్యారు.జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు, వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి సంఘం సమిష్టిగా కృషి చేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన భద్రతకు ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఖమ్మం జిల్లా నాయకులు పాల్గొనడం ద్వారా జిల్లా జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర స్థాయిలో ప్రస్తావించేందుకు, సంఘం కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అవకాశం ఏర్పడిందని నాయకులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి :: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు_ఎస్సై గజ్జల నరేష్












