14/11/2026, Saturday · 05:27:59 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సి.వై. పుల్లయ్య పిలుపు

Yakub Pasha 13/11/2026 9:15 AM ఖమ్మం

ప్రజా గర్జనను జయప్రదం చేయండి _  సి.వై. పుల్లయ్య పిలుపు
Want this news as a newspaper clip?Print News Clip

ప్రజా గర్జనను జయప్రదం చేయండి

డిసెంబర్ 29న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన, బహిరంగ సభ

సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య పిలుపు

నేలకొండపల్లి, నవంబర్ 13 (పీపుల్స్ వాయిస్):

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా గర్జన ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య పిలుపునిచ్చారు.గురువారం నేలకొండపల్లిలో పగిడికత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంపద, కీలక వనరులను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు, విదేశీ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరుతో పేదలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో నాయకులు పగిడికత్తుల రామదాసు, చిర్ర బిక్షం, పగిడికత్తుల నాగేశ్వరరావు, దామల్ల రామదాసు, షకీలా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

Public RallySuccessPullayyaAppeal

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

204 Posts

Latest News

తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సీ.వై. పుల్లయ్య కామన్ స్కూల్ విధానమే సామాజిక సమానత్వానికి పునాది! తీన్మార్ మల్లన్న పాదయాత్రపై లారీ దూసుకొచ్చిన ఘటనను ఖండించిన టీఆర్పీ బొమ్మెర రామ్మూర్తికి ఘన సత్కారం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచులు ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పిలుపు పేదల ఇళ్లను కూల్చి.. ఇప్పుడు భూమికి ప్రహరీనా - సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో బాలుడి హత్య! తెలంగాణ ఉద్యమానికి పాటలే ఆయుధాలు.. అందెశ్రీకి ఖమ్మం ఉద్యమకారుల ఘన నివాళి! నిరుపేద డాడీ లంబాడీలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించాలి