04/11/2026, Wednesday · 08:23:36 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి!

Yakub Pasha 04/11/2026 6:26 PM ఖమ్మం

మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి!
Want this news as a newspaper clip?Print News Clip

మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి!

పంట నష్టంపై రైతులతో ఆరా.. అండగా ఉంటామని భరోసా

సత్తుపల్లి, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ క్షేత్రస్థాయిలో పర్యటించి నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని, పంటలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి తుఫాన్ కారణంగా ఎదురైన ఇబ్బందులు, పంట నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, పంట నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నష్టాన్ని అంచనా వేసేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు, సత్తుపల్లి, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Ramgai inspectsRicefieldssubmergedMurasucycloneMLAfield

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

153 Posts

Latest News

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత! అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు! అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్ మురసు తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్ జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని