09/11/2026, Monday · 11:06:00 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

సొంతింట్లో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ నేతల సంబరాలు!

Yakub Pasha 09/11/2026 8:24 AM ఖమ్మం

సొంతింట్లో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ నేతల సంబరాలు!
Want this news as a newspaper clip?Print News Clip
  • ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇంట్లో వేడుకలు
  • సొంతింటి కుటుంబంతో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చిన కాంగ్రెస్ నాయకులు
  • పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం: సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినాల శ్రీనివాస్

సొంతింట్లో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ నేతల సంబరాలు!

చింతకాని, నవంబర్ 09 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా వందనం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటిని అందంగా అలంకరించి, దీపాలు వెలిగించి, టపాసులు కాలుస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. సొంతింటిలో దీపావళి జరుపుకుంటున్న లబ్ధిదారుల కుటుంబంతో సంతోషాలను పంచుకుని ఆత్మీయతను చాటుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ (BLA) మిట్టపల్లి కొండలరావు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం లబ్ధిదారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని పేర్కొన్నారు. సొంతింటిలో దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకోవడం లబ్ధిదారులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అమర్లపూడి శ్రీను ( సిపిఐ పార్టీ ), గ్రామ కార్యదర్శి అయినాల శ్రీనివాస్, గ్రామ ఉపాధ్యక్షుడు ఎస్.కె. మోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: సోషల్ మీడియా వేధింపుల కేసులో నిందితుడి అరెస్టు.. చింతకాని పోలీసుల చర్యలు!

celebrate DiwaliCongressleadersfamilyIndirammabeneficiaries

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

187 Posts

Latest News

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. రూ.13 లక్షల స్కాం గుట్టురట్టు! డాక్టర్ కోట రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు.. ఆర్జేసీ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా..నివాసానికిచేరుకుని శుభాకాంక్షలు తెలిపిన వందనం బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేధింపుల కేసులో నిందితుడి అరెస్టు.. చింతకాని పోలీసుల చర్యలు! చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దీపావళి వేళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి _సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర