21/10/2026, Wednesday · 03:29:51 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

బెదిరింపులపై ఆవేదన.. యువ న్యాయవాది మృతి

Yakub Pasha 21/10/2026 1:51 PM ఖమ్మం

బెదిరింపులపై ఆవేదన.. యువ న్యాయవాది మృతి
Want this news as a newspaper clip?Print News Clip

బెదిరింపులపై ఆవేదన.. యువ న్యాయవాది మృతి

రఘనాథపాలెం, అక్టోబర్ 21 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ. వెంకటాయపాలెంలో 27 ఏళ్ల జూనియర్ న్యాయవాది గణేశ్ మృతి విషాదం నింపింది. ఏడాది కాలంగా ఖమ్మం కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న గణేశ్ సోమవారం రాత్రి తన అమ్మమ్మ ఇంట్లో మృతి చెందాడు.

గత నాలుగు రోజులుగా ఎవరో తనను వెంబడిస్తున్నారని, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారని గణేశ్ చెప్పినట్లు అతడి తండ్రి దానయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తన కుమారుడు ఆందోళనకు గురైనట్లు ఆయన తెలిపారు.

సోమవారం రాత్రి గణేశ్ తన అన్న సాయితేజతో కలిసి అమ్మమ్మ పద్మావతి ఇంటికి వెళ్లాడు. అనంతరం పద్మావతి, సాయితేజ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి గణేశ్ మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గణేశ్ మృతికి దారితీసిన పరిస్థితులు, ఫోన్ బెదిరింపుల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

lawyer diesAnguishedthreatsyoung

About the author

Yakub Pasha

Yakub Pasha

Managing Director

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

49 Posts

Latest News

నాగులవంచ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా నూతన వస్త్రాల పంపిణీ దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ విధానం! దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి ఖమ్మంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వీరంగం.. బాటిళ్లు ధ్వంసం, మేనేజర్‌పై దాడి దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాతర్లపాడు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి నాసిరకంగా యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులు! దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తెలుగు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి