21/10/2026, Wednesday · 04:07:50 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్‌రావు

Yakub Pasha 20/10/2026 3:55 PM రాష్ట్ర వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్‌రావు
Want this news as a newspaper clip?Print News Clip

తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్‌రావు

ధర్మమే అంతిమంగా విజయం సాధిస్తుంది.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు


 హైదరాబాద్ అక్టోబర్ 20 ( పీపుల్స్ వాయిస్ )


హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి ధర్మమే విజయం సాధిస్తుందని విజయదశమి పండుగ సందేశమిస్తుందని పేర్కొన్నారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ఈ పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

విజయదశమి సందర్భంగా రైతులకు మంచి పంటలు పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలని, మహిళలు గౌరవం, భద్రతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

ప్రజలంతా ఐక్యత, సామరస్యంతో ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రం, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విజయదశమి స్ఫూర్తితో సత్యం, ధర్మం, న్యాయం పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

wishes peopleRamachandraRaoTelugustatesVijayadashami

About the author

Yakub Pasha

Yakub Pasha

Managing Director

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

46 Posts

Latest News

దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి ఖమ్మంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వీరంగం.. బాటిళ్లు ధ్వంసం, మేనేజర్‌పై దాడి దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాతర్లపాడు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి నాసిరకంగా యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులు! దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తెలుగు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం