07/11/2026, Saturday · 09:27:18 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!

Yakub Pasha 07/11/2026 8:15 AM క్రైమ్

పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!
Want this news as a newspaper clip?Print News Clip
  • పాలపొడి, నీరు, హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో సింథటిక్ పాల తయారీ
  • 100 లీటర్ల కల్తీ పాలు, 35 కిలోల పాలపొడి స్వాధీనం.. ఒకరి అరెస్ట్

పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!

హైదరాబాద్‌కు కల్తీ పాల సరఫరా.. పోచారంలో తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసుల దాడి

హైదరాబాద్, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పాల ముఠా గుట్టును మహేశ్వరం జోన్ ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో రహస్యంగా నిర్వహిస్తున్న సింథటిక్ పాల తయారీ కేంద్రంపై శుక్రవారం రాత్రి దాడి చేసి భారీగా కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిని అరెస్టు చేశారు.

పోచారం గ్రామానికి చెందిన ఆండే శ్రీశైలం (43) తన ఇంట్లోనే అక్రమంగా కల్తీ పాల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పాలపొడిలో నీటితో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని కలిపి సింథటిక్ పాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడిలో 100 లీటర్ల కల్తీ పాలు, 35 కిలోల ధోల్‌పూర్ బ్రాండ్ పాలపొడి, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తయారు చేసిన కల్తీ పాలను హైదరాబాద్ నగరంలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.నిందితుడు శ్రీశైలంపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ కల్తీ పాల తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా? నగరంలో ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ పాల దందాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

ఇది కూడా చదవండి :: అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు

milk preparationPoisonnameSyntheticchemicals

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

179 Posts

Latest News

ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్ పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు! ఆపదలో ప్రజల మధ్యకు.. బాధ్యతలో ముందంజ.. కలెక్టర్‌కు జర్నలిస్టుల ఘన సత్కారం!