18/11/2026, Wednesday · 12:15:33 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - PDSU జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్

Yakub Pasha 17/11/2026 7:12 PM ఖమ్మం

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - PDSU జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్
Want this news as a newspaper clip?Print News Clip

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి

_విద్యార్థినుల పట్ల అసభ్యకర ప్రవర్తన, పరీక్ష ఫీజుల వసూళ్లలో ఇబ్బందులపై ఆరోపణలు

_అడిషనల్ కలెక్టర్ శ్రీజకు ఫిర్యాదు చేసిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

కల్లూరు, నవంబర్ 17 (పీపుల్స్ వాయిస్):

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వేముల శేఖర్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలైన పీడీఎస్‌యూ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ వేముల శేఖర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ పరీక్ష ఫీజులు చెల్లించుకునే విషయంలో ఇబ్బందులు కల్పిస్తున్నారని, ఫీజుల చెల్లింపు పేరుతో గదికి పిలిపించి విద్యార్థినుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని అడిషనల్ కలెక్టర్‌కు వివరించినట్లు తెలిపారు.ఈ వ్యవహారంపై స్పందించిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అడిషనల్ కలెక్టర్ శ్రీజను కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు చేసిన ఆరోపణలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి టి. లక్ష్మణ్, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి బెజవాడ సాయి శేషు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు భూక్య బాలాజీ నాయక్, ఏఐఎస్ఏ జిల్లా సహాయ కార్యదర్శి అభిషేక్, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు నవీన్, శశి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: డిసెంబర్ 29న ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సి వై పుల్లయ్య

Secretary LakshmanPrincipalKallurGovernmentJuniorCollegesuspendedPDSU

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

215 Posts

Latest News

జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల ఇళ్ల స్థలాల జీఓ 147ను అమలు చేయాలి _ సివై పుల్లయ్య వెలుగుమట్ల భూదాన భూమికి ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుంటాం! మాస్ లైన్ డిసెంబర్ 29న ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సి వై పుల్లయ్య జర్నలిస్టుల డిమాండ్లకు PDSU మద్దతు! PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ వైద్యులపై తప్పుడు ప్రచారమా? డాక్టర్ ముక్కపాటి కోటేశ్వరరావు అర్హులందరికీ రాజీవ్ యువ వికాస పథకం అమలు చేయాలి! ఎన్.వి. రాకేష్ ఎంపీ వద్దిరాజుకు చెరుకూరి వారి తోటలో మున్నూరుకాపుల అపూర్వ స్వాగతం! నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు కలెక్టరేట్ ఎదుట ధర్నా _ టీజేఎఫ్ పిలుపు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల వితరణ