26/11/2026, Thursday · 10:11:49 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు

Yakub Pasha 26/11/2026 7:22 AM క్రైమ్

సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు
Want this news as a newspaper clip?Print News Clip

సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు

రౌడీయిజాన్ని ప్రోత్సహించేలా రీల్స్.. మారణాయుధాలు స్వాధీనం

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: రఘునాథపాలెం పోలీసులు

ఖమ్మం, నవంబర్ 25 (పీపుల్స్ వాయిస్):
 సోషల్ మీడియాలో మారణాయుధాలను ప్రదర్శిస్తూ, రౌడీయిజాన్ని ప్రోత్సహించే విధంగా వీడియోలు, రీల్స్ పోస్టు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తిపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల సోషల్ మీడియా పర్యవేక్షణలో భాగంగా 'Mohammadthgur' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను గుర్తించారు. సదరు ఖాతాలో కత్తులు ప్రదర్శిస్తూ వీడియోలు పోస్టు చేయడంతో పాటు, గ్యాంగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు, రౌడీగా తనను తాను చిత్రీకరించుకుంటూ ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా రీల్స్ అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అతని గత నేర చరిత్రపై పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు.సోషల్ మీడియా వేదికగా మారణాయుధాలను ప్రదర్శించినా, రౌడీయిజాన్ని ప్రోత్సహించే పోస్టులు పెట్టినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రఘునాథపాలెం పోలీసులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి :: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Case registeredDisplayknivessocialmediaindividual

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

274 Posts

Latest News

రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు ఆటపాటలతో.. ఆత్మీయ సత్కారాలతో సందడిగా వన సమారాధన రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన.. బ్రెయినీ స్టార్స్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అయ్యప్ప స్వాములకు అన్నదాన సేవలో మందడపు లక్ష్మీ మనోహర్! అసమాన విద్యా అవకాశాలున్న సమాజంలో ప్రజాస్వామ్య వికాసం అసాధ్యం! చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం నూతన వధూవరులను ఆశీర్వదించిన కన్నెబోయిన గోపి యాదవ్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా