07/11/2026, Saturday · 09:27:18 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు!

Yakub Pasha 07/11/2026 7:53 AM ఖమ్మం

పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు!
Want this news as a newspaper clip?Print News Clip
  • దూదేకుల ఆత్మగౌరవ భవనానికి రూ.3 కోట్ల మంజూరు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం!
  • దివంగత నేత పకీర్ సాహెబ్ శ్రమకు దక్కిన ఫలితం.. బడే సాహెబ్

పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు!

ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ రాష్ట్రంలో దూదేకుల ముస్లింల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంపై దూదేకుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బడే సాహెబ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల కేటాయింపు దూదేకుల సమాజం చిరకాల ఆకాంక్ష నెరవేరేందుకు కీలక ముందడుగు అని పేర్కొన్నారు.శుక్రవారం ఖమ్మంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన దూదేకుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న విడుదల చేసిన జీవో నంబర్ 14 ప్రకారం రాష్ట్రంలోని 38 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రూ.88 కోట్లు కేటాయించిందని, ఇందులో దూదేకుల ఆత్మగౌరవ భవనానికి రూ.3 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు నుంచి, ఆ తర్వాత కూడా దూదేకుల సమాజ హక్కుల కోసం దివంగత నేత పకీర్ సాహెబ్ చేసిన కృషి ఎనలేనిదని, ఆయన పోరాటం, శ్రమ ఫలితంగానే నేడు ఆత్మగౌరవ భవనానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గాలిబ్ సాహెబ్ కృషి కూడా ఈ సాధనలో కీలకమని గుర్తుచేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో సుమారు 16 లక్షల మందికి పైగా ఉన్న దూదేకుల సమాజ ప్రజలందరికీ ఈ ఆత్మగౌరవ భవనంపై సమాన హక్కు ఉంటుందని బడే సాహెబ్ స్పష్టం చేశారు. ఈ భవనం ఏ ఒక్క వ్యక్తికో, వర్గానికో పరిమితం కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరికీ చెందుతుందని, అందరి సమష్టి పోరాట ఫలితమే ఈ విజయమని పేర్కొన్నారు.ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సలీం మాట్లాడుతూ.. దూదేకుల ఆత్మగౌరవ భవనానికి రూ.3 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. దివంగత నేతలు పకీర్ సాహెబ్, గాలిబ్ సాహెబ్ సాగించిన పోరాటాల ఫలితంగానే ఈ రోజు భవన నిర్మాణానికి మార్గం సుగమమైందని అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ కలాం, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అడ్వకేట్ నాగ సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, కైకొండాయిగూడెం జిల్లా జేఏసీ ఉపాధ్యక్షుడు షేక్ మౌలాలి, ఖమ్మం నగర అధ్యక్షుడు షేక్ అన్వర్ పాషా, జిల్లా కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ వలి, కోటపాడు సైదులు, యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!

Pakir SahebresultfightRs3croreDoodekulabuilding

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

179 Posts

Latest News

ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు! కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్ ఆపదలో ప్రజల మధ్యకు.. బాధ్యతలో ముందంజ.. కలెక్టర్‌కు జర్నలిస్టుల ఘన సత్కారం!