05/11/2026, Thursday · 09:02:34 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్

Yakub Pasha 05/11/2026 7:37 PM ఖమ్మం

ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్
Want this news as a newspaper clip?Print News Clip
  • ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం
  • ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు కుదిరితే కాంగ్రెస్‌తో కలిసి పోటీ
  • పొత్తు లేకుంటే సొంతంగా బరిలోకి దిగుతాం
  • తెలంగాణలో IUMLను బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం
  • నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం పోరాటం
  • విద్య, వైద్యం రంగాల్లో పేదలకు న్యాయం జరిగేలా కృషి
  • మతసామరస్యం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబాటు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ
  • ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటమే తమ విధానం

ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం!

తెలంగాణలో IUMLను బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం

ఖమ్మంలో మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ మహమ్మద్ షకీల్

ఖమ్మం, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ మహమ్మద్ షకీల్ స్పష్టం చేశారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరితే కలిసి పనిచేస్తామని, లేనిపక్షంలో పార్టీ తరఫున సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో IUMLను బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఖమ్మం నగరంలోని రెస్టిన్ హోటల్‌లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. బాజీబాబా నేతృత్వంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ మాట్లాడుతూ ప్రజల హక్కుల సాధన కోసం, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సాధించడం, విద్యా, వైద్య రంగాల్లో పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం తమ పార్టీ ప్రధాన కార్యాచరణలో భాగమని వివరించారు. ప్రజా సమస్యలపై ఎలాంటి రాజీ లేకుండా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మతసామరస్యం, సోదరభావం, సామాజిక సమానత్వం బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధానాలకు తావులేకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు సాగుతామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. బాజీబాబా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చీమకుర్తి బ్రహ్మచారి, ఆటో యూనియన్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ హనీఫ్, జిల్లా కోశాధికారి సర్వర్ పాషా, ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు ఫర్హీన సుల్తానా, హరి బహదూర్, బి. రాజు, మహిళా అధ్యక్షురాలు షేక్ జరీనా, రాష్ట్ర నాయకులు, ఇతర పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!

Advocate ShakeelIUMLmaingoalsolvepublicproblemsState

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

164 Posts

Latest News

ఖమ్మం కాంగ్రెస్ సంజీవయ్య భవన్‌లో ప్రజా దర్బార్ ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యలకు పరిష్కారం _ పీడీఎస్‌యూ నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత! ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ అమరులైనా.. వారు నమ్మిన ఆశయాలు సజీవం! మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి_పోటు రంగారావు హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడనే ఆరోపణ.. పదో తరగతి విద్యార్థి మృతి అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం! రేకుల ఇళ్లలో రెక్కల కష్టం.. పాములు, తేళ్ల మధ్య పేదల బతుకులు! ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్పంచ్ వినతి ఎంపీ వద్దిరాజును సన్మానించి జ్ఞాపిక అందజేసిన జల్లెల శ్రీనివాసరావు దీపావళి బాణసంచా దుకాణాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి!ఎస్సై జి. నరేష్ హెచ్చరిక