దీపావళి బాణసంచా దుకాణాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి!ఎస్సై జి. నరేష్ హెచ్చరిక

దీపావళి బాణసంచా దుకాణాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి!
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. ఎస్సై జి. నరేష్ హెచ్చరిక
చింతకాని, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):
దీపావళి పండుగ సందర్భంగా చింతకాని మండలంలోని వివిధ గ్రామాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు, లైసెన్సులు పొందాలని చింతకాని ఎస్సై జి. నరేష్ సూచించారు.అనుమతులు పొందిన వ్యాపారులు మాత్రమే అధికారులు నిర్దేశించిన ప్రదేశాల్లో బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బాణసంచా విక్రయాల సమయంలో ప్రభుత్వ నిబంధనలతో పాటు అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినా, అక్రమంగా బాణసంచా నిల్వ చేసినా, విక్రయించినా సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీపావళి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వ్యాపారులు నిబంధనలు పాటించాలని ఎస్సై నరేష్ కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి :: మురసు తుఫాన్ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్












