04/11/2026, Wednesday · 11:22:33 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

రేకుల ఇళ్లలో రెక్కల కష్టం.. పాములు, తేళ్ల మధ్య పేదల బతుకులు! ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్పంచ్ వినతి

Yakub Pasha 04/11/2026 9:35 PM ఖమ్మం

రేకుల ఇళ్లలో రెక్కల కష్టం.. పాములు, తేళ్ల మధ్య పేదల బతుకులు! ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్పంచ్ వినతి
Want this news as a newspaper clip?Print News Clip
  • ఈదురుగాలులు, అకాల వర్షాలకు ఎగిరిపోయిన పైకప్పులు
  • రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
  • అనర్హులను తొలగించి నిజమైన అర్హులకే న్యాయం చేయాలి
  • ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ వీరబాబు

రేకుల ఇళ్లలో రెక్కల కష్టం.. పాములు, తేళ్ల మధ్య పేదల బతుకులు! ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్పంచ్ వినతి

చింతకాని, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

మండలంలోని తిరుమలాపురం గ్రామంలో నిరుపేద కుటుంబాల నివాస కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సరైన పక్కా ఇళ్లు లేక రేకుల ఇళ్లలోనే జీవనం సాగిస్తున్న పేదలపై ఇటీవల ప్రకృతి ప్రకోపం పిడుగులా పడింది. భారీ ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా రేకుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి నివాసాలు దెబ్బతిన్నాయని గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో బుధవారం ఉపసర్పంచ్ గోగుల నాగమణి, గ్రామ నాయకుడు గోగుల నరసింహారావుతో కలిసి చింతకాని ఎంపీడీవో చుంచు శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు.

పాములు, తేళ్ల భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం

ఈ సందర్భంగా సర్పంచ్ వీరబాబు మాట్లాడుతూ.. వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు చేరుతోందని, రాత్రివేళల్లో పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తుండటంతో నిరుపేద కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయని తెలిపారు. చిన్నపిల్లలతో కూడిన కుటుంబాలు రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రభుత్వం అమలు చేయనున్న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత కల్పించి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత కుటుంబాల నివాస పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే రూపొందించిన లబ్ధిదారుల జాబితాల్లో అనర్హులు ఉంటే వారిని తొలగించి, గ్రామసభ నిర్వహించి పారదర్శకంగా నిజమైన అర్హులైన నిరుపేదలను గుర్తించాలని కోరారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా న్యాయం జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వీరబాబు ఎంపీడీవోను కోరారు.

ఇది కూడా చదవండి :: మురసు తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్

poor livesfoxhouseswingsstucksnakesscorpionsSarpanchRequest

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

157 Posts

Latest News

అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం! ఎంపీ వద్దిరాజును సన్మానించి జ్ఞాపిక అందజేసిన జల్లెల శ్రీనివాసరావు దీపావళి బాణసంచా దుకాణాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి!ఎస్సై జి. నరేష్ హెచ్చరిక జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు! మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత! అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు! అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్