05/11/2026, Thursday · 09:56:50 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత! ట్రాఫిక్ సీఐ శివప్రసాద్

Yakub Pasha 05/11/2026 8:44 PM క్రైమ్

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత! ట్రాఫిక్ సీఐ శివప్రసాద్
Want this news as a newspaper clip?Print News Clip
  • జడ్పీ సెంటర్ వద్ద ఆటో నుంచి కిందపడిన పర్సు
  • పర్సులో రూ.9 వేల నగదు, పేటీఎం కార్డు గుర్తింపు
  • పేటీఎం కార్డు ఆధారంగా యజమాని చిరునామా గుర్తించిన హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్
  • యజమానికి పర్సు, నగదు అందజేసిన ట్రాఫిక్ సీఐ శివప్రసాద్

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు.. పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత!

ఖమ్మం, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
 విధి నిర్వహణలో నిజాయితీ, బాధ్యతాయుతంగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులు పోగొట్టుకున్న పర్సును గుర్తించి యజమానికి తిరిగి అందజేశారు. స్థానిక జడ్పీ సెంటర్ వద్ద ఆటో నుంచి కిందపడిన పర్సును విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గుర్తించారు.పర్సును పరిశీలించగా అందులో పేటీఎం కార్డుతో పాటు రూ.9 వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. యజమానికి సంబంధించిన ఇతర వివరాలు ఏవీ లభించకపోవడంతో పేటీఎం కార్డు ఆధారంగా ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ విచారణ చేపట్టారు. కార్డు వివరాల ఆధారంగా పర్సు యజమాని చిరునామాను గుర్తించి, అతడిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.అనంతరం ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ యజమానికి పర్సుతో పాటు అందులోని రూ.9 వేల నగదును తిరిగి అందజేశారు. పోగొట్టుకున్న సొమ్మును భద్రంగా తిరిగి అందించిన ట్రాఫిక్ పోలీసుల నిజాయితీ, చొరవను పలువురు అభినందించారు.

ఇది కూడా చదవండి :: ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్

Police handedHonestTrafficownerlostpurseSivaprasad

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

167 Posts

Latest News

వైభవంగా నికిత – వినీత్ గౌడ్‌ల నిశ్చితార్థం.. నూతన జంటను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నేతలు! కొదుమూరులో ఘనంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేసిన సర్పంచ్ మొగిలి కృష్ణయ్య..! ఖమ్మం కాంగ్రెస్ సంజీవయ్య భవన్‌లో ప్రజా దర్బార్ ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యలకు పరిష్కారం _ పీడీఎస్‌యూ అమరులైనా.. వారు నమ్మిన ఆశయాలు సజీవం! మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్ బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి_పోటు రంగారావు హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడనే ఆరోపణ.. పదో తరగతి విద్యార్థి మృతి అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!