03/11/2026, Tuesday · 08:57:21 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్

Yakub Pasha 03/11/2026 6:50 PM ఖమ్మం

జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్
Want this news as a newspaper clip?Print News Clip
  • 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించండి.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి!
  • పేట్ బషీరాబాద్, నిజాంపేట్ భూములనే సొసైటీ సభ్యులకు ఇవ్వాలి
  • ప్రత్యేక జీవో జారీ చేసి అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలి
  • ఇందిరాపార్కు వద్ద జేఎన్‌జే సొసైటీ సభ్యుల ధర్నాకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం

జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

18 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం ఇకనైనా జాప్యం చేయకుండా ప్రత్యేక జీవో జారీ చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ స్థలాలు కేటాయించాలని కోరారు.ఇళ్ల స్థలాల సాధన కోసం జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (టీమ్ జేఎన్‌జే) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. సొసైటీ సభ్యులతో పాటు వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ.. 18 ఏళ్ల క్రితం జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్, నిజాంపేట్ ప్రాంతాల్లో కేటాయించిన భూములను సభ్యులకు అప్పగించకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్యాయమని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు చెల్లించి ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిజాంపేట్‌లోని సర్వే నంబర్ 332లో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్‌లోని సర్వే నంబర్ 25/2లో 38 ఎకరాల భూమిని కేటాయించారని గుర్తుచేశారు. ఆ భూములను సొసైటీ సభ్యులకు అందించకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లడమేనని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలుమార్లు హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా హామీలు అమలు కాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని, జేఎన్‌జే సొసైటీ సభ్యులకు పేట్ బషీరాబాద్, నిజాంపేట్‌లో కేటాయించిన స్థలాలనే అందించాలని డిమాండ్ చేశారు.సొసైటీ సభ్యులు రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పేట్ బషీరాబాద్, నిజాంపేట్ భూములను సొసైటీ సభ్యులకు కేటాయించాలని కోరుతూ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఎంవీఆర్ శాస్త్రి, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు, టీఆర్‌ఎస్ మీడియా విభాగం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, జేఎన్‌జే సొసైటీ నాయకులు అశోక్ రెడ్డి, శ్రీనివాసరావు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, కో-కన్వీనర్లు ఎం. రవికుమార్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Mango SomayyaDontesttolerancejournalistsSolveyearold

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అమరుడు శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో ఉద్యమించాలి_50వ వర్ధంతి సభలో పీడీఎస్‌యూ నేతల పిలుపు