ఎంపీ వద్దిరాజుకు చెరుకూరి వారి తోటలో మున్నూరుకాపుల అపూర్వ స్వాగతం!

- వన సమారాధన మహోత్సవానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
- మహిళలు, కులబాంధవుల ఘన స్వాగతం.. కార్యక్రమంలో పాల్గొన్న మల్లేశ్వరి
ఎంపీ వద్దిరాజుకు చెరుకూరి వారి తోటలో మున్నూరుకాపుల అపూర్వ స్వాగతం!
ఖమ్మం, నవంబర్ 15 (పీపుల్స్ వాయిస్):
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్రకు ఖమ్మంలో మున్నూరుకాపు కులబాంధవులు అపూర్వ స్వాగతం పలికారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో నిర్వహించిన వన సమారాధన మహోత్సవానికి ఆయన తన సతీమణి విజయలక్ష్మి, పెద్దన్న వద్దిరాజు కిషన్‌తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కులబాంధవులు బాణసంచా కాలుస్తూ, పూలు జల్లుతూ, జై మున్నూరుకాపు.. జైజై మున్నూరుకాపు, మున్నూరుకాపుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు.అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వనదేవత, ఉసిరి చెట్టు, పరమశివుడు, గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వన సమారాధన మహోత్సవాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చింతకాని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షురాలు మల్లేశ్వరి పాల్గొని కార్యక్రమంలో సందడి చేశారు. పలువురు మున్నూరుకాపు సంఘం నాయకులు, మహిళలు, కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ విధానం!












