కార్తిక వన సమారాధన విజయవంతం.. బంజారా కుటుంబాలకు కృతజ్ఞతలు _ వేడుకల్లో పాల్గొన్న బంజారా కుటుంబాలు

కార్తిక వన సమారాధన విజయవంతం.. బంజారా కుటుంబాలకు కృతజ్ఞతలు
వేలాదిగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్న బంజారా కుటుంబాలు
ఖమ్మం, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జిల్లా కేంద్రంలో బంజారా సమాజం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్తిక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన వేలాది బంజారా కుటుంబాలకు కార్యదర్శి భుక్యా శోభన్ నాయక్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కుల సంఘాల జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనివార్య కారణాలతో హాజరుకాలేకపోయిన పలువురు ఫోన్ ద్వారా తమ సందేశాలను పంపించారు.కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వనభోజన నిర్వహణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పోరిక లచ్చిరామ్ నాయక్, భుక్యా మంగ్యా నాయక్, రామారావు, కోశాధికారి మంగీలాల్ జాదవ్, గంగావత్ రమేష్, కార్యదర్శి భుక్యా శోభన్ నాయక్, భుక్యా చంద్రు నాయక్, తిరుపతి నాయక్, మూడు బాల్‌సింగ్ నాయక్, ధరం సోత్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్












