24/10/2026, Saturday · 09:31:02 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఎల్‌నినో ముప్పును సమష్టిగా ఎదుర్కొందాం!

Yakub Pasha 24/10/2026 7:01 PM ఖమ్మం

ఎల్‌నినో ముప్పును సమష్టిగా ఎదుర్కొందాం!
Want this news as a newspaper clip?Print News Clip
  • ఎల్‌నినో ముప్పును సమష్టిగా ఎదుర్కొందాం!
  • రానున్న 10 నెలలు తాగునీటి సంరక్షణే ప్రథమ ప్రాధాన్యం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు

ఎల్‌నినో ముప్పును సమష్టిగా ఎదుర్కొందాం!

రానున్న 10 నెలలు తాగునీటి సంరక్షణే ప్రథమ ప్రాధాన్యం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు

చింతకాని, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నీటి సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రానున్న పది నెలల పాటు మనుషులు, పశువుల తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

శనివారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డితో కలిసి పర్యటించిన భట్టి విక్రమార్క.. కొదుమూరు గ్రామంలో మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నీటి వనరులు తగ్గిపోయే ప్రమాదం ఉందని, భూగర్భ జలాలు అడుగంటకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 44 వేల చెరువుల్లో సుమారు 40 శాతం చెరువుల్లో పావు వంతు కంటే తక్కువ నీరు మాత్రమే ఉందని తెలిపారు.

విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినా కోతలు లేవు

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 20 వేల మెగావాట్లకు పైగా పెరిగినప్పటికీ కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో రోజువారీ విద్యుత్‌ అవసరం 245 మిలియన్‌ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 335 మిలియన్‌ యూనిట్లకు చేరిందని వివరించారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో దాదాపు 15 లక్షల పంపుసెట్లు ప్రభావితమయ్యాయని తెలిపారు. నీరు అందుబాటులో లేనప్పుడు మోటార్లు నడపవద్దని, పంపుసెట్లకు అమర్చిన ఆటో స్టార్టర్లను తొలగించాలని రైతులకు సూచించారు. నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని కోరారు.

నీటి సంరక్షణతో గ్రామీణ ఉపాధి

కరువు పరిస్థితులను ఎదుర్కొంటూనే గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా పనులు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్లు, బోర్‌ రీఛార్జ్‌ పిట్లు, పశువుల షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణంతో పాటు కాలువల శుభ్రత, చెరువుల పూడికతీత పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

గ్రామాల వారీగా నీటి లభ్యతను అంచనా వేసి, దానికి అనుగుణంగా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నీటి సంరక్షణ పనుల ద్వారా భూగర్భ జలాల పెంపునకు తోడ్పడటంతో పాటు గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజలను కరువు సంక్షోభం నుంచి కాపాడటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ ప్రభుత్వ చర్యలకు సహకరించాలని కోరారు.

ఈ పర్యటనలో సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సంబంధిత అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఈ నెల 25న ముదిగొండలో గ్రామీణ వైద్యుల మహాసభ

Niño collectivelyLetfacethreat

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

79 Posts

Latest News