రూ.2 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు అవాస్తవం

రూ.2 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు అవాస్తవం
ఆరోపణలను ఖండించిన హైదర్‌సాయిపేట సర్పంచ్ సీమ్లా నాయక్
తిరుమలాయపాలెం, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):
హైదర్‌సాయిపేట గ్రామ సర్పంచ్ సీమ్లా నాయక్ రూ.2 లక్షలు డిమాండ్ చేశారంటూ కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన ఖండించారు.
గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూమి వివాదం తలెత్తడంతో వారు తనను సంప్రదించారని తెలిపారు. ఈ క్రమంలో సుమారు 10 మంది గ్రామ పెద్దల సమక్షంలో ఇరువురి వాదనలు విని పంచాయతీ నిర్వహించినట్లు వివరించారు. అయితే, ఈ వ్యవహారంలో తాను ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.
తనపై నిరాధార ఆరోపణలతో వార్తలు ప్రచురించడం సరికాదని పేర్కొంటూ, ఇలాంటి ప్రచారం కొనసాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీమ్లా నాయక్ హెచ్చరించారు.
ఇదీ చదవండి :: ఈ నెల 25న ముదిగొండలో గ్రామీణ వైద్యుల మహాసభ












