ధైర్యం.. తెగువకు ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి! ప్రభుత్వ మహిళా కళాశాలలో జయంతి వేడుకలు

ధైర్యం, తెగువల కలయిక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి
ప్రతి ఆడబిడ్డా ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలి: పూరేటి స్వరాజ్య కుమారి
ప్రభుత్వ మహిళా కళాశాలలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు
ఖమ్మం, నవంబర్ 19 (పీపుల్స్ వాయిస్):
ధైర్యం, దేశభక్తి, ఆత్మగౌరవం, తెగువ కలగలిసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఎంటర్‌ప్రెన్యూర్ పూరేటి స్వరాజ్య కుమారి అన్నారు. గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పూరేటి స్వరాజ్య కుమారి మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటే ప్రతి ఆడబిడ్డా ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా ఎదగగలదని పేర్కొన్నారు. మహిళలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: తోటి మెకానిక్ కుటుంబానికి అండగా త్రీ టౌన్ మెకానిక్ సోదరులు!












