22/11/2026, Sunday · 02:16:09 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

కోర్టు ఉత్తర్వులకే బేఖాతరా..? 85 ఏళ్ల వృద్ధురాలి ఆచూకీ ఏదీ.. వారసత్వ భూములపై మ్యుటేషన్ యత్నాలా!

Yakub Pasha 21/11/2026 2:26 PM క్రైమ్

కోర్టు ఉత్తర్వులకే బేఖాతరా..? 85 ఏళ్ల వృద్ధురాలి ఆచూకీ ఏదీ.. వారసత్వ భూములపై మ్యుటేషన్ యత్నాలా!
Want this news as a newspaper clip?Print News Clip

కోర్టు ఉత్తర్వులున్నా వారసత్వ భూముల మ్యుటేషన్‌కు యత్నాలు!

85 ఏళ్ల వృద్ధురాలి అదృశ్యం, 20 కాసుల బంగారం మాయంపై బాధితురాలి ఆరోపణలు

వేంసూరు, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

కుటుంబ వారసత్వ భూముల వివాదం వేంసూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. భూములను ఇతరులకు బదలాయించరాదంటూ హైకోర్టు, సివిల్ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మ్యుటేషన్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలు ఆరోపించింది. తన 85 ఏళ్ల వృద్ధ తల్లి అదృశ్యమవడంతో పాటు ఆమె వద్ద ఉన్న సుమారు 20 కాసుల బంగారం మాయమైందని ఆవేదన వ్యక్తం చేసింది.అంగన్‌వాడీ సూపర్‌వైజర్ భవాని, ఆమె భర్త ఆర్చేపల్లి వేణు, ఆర్చేపల్లి మధుసూదన్ తదితరుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. తల్లి నుంచి ఒత్తిడితోలేదామోసపూరితంగా వేలిముద్రలు సేకరించి ఆస్తుల లావాదేవీలు చేపడితే అంగీకరించబోమని హెచ్చరించింది.ఈ భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో W.P.No.38601/2026, సివిల్ కోర్టులో O.S.No.36/2026, I.A.No.3/2026 ద్వారా న్యాయపరమైన ఉత్తర్వులు పొందినట్లు బాధితురాలు తెలిపింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది.వృద్ధురాలి ఆచూకీ కనుగొని తనకు అప్పగించాలని, బంగారం మాయమైనట్లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. అవసరమైతే పోలీసులను ఆశ్రయించి న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన సహకారం అందించిన న్యాయవాది కొమ్మినపల్లి నాగపుష్పవతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఇది కూడా చదవండి :: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే! మామిడి సోమయ్య

edi varasatvakortuuttarvulakebekhataraellavruddhuraliachuki

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

245 Posts

Latest News

ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి! గోగినపల్లి మస్తాన్ జనసేనలోకి ఖమ్మం నేత మాటేటి రవి! మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి! కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి! డీపీఆర్ఓకు టీజేఎఫ్ వినతి మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం! కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!సి.వై. పుల్లయ్య 44వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై విస్తృత ప్రచారం! అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలి! వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి_ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్